Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అత్తపై అల్లుడి దాడి
By Eenadu1 min read at Eenadu
In brief
A man named Satish allegedly attacked his mother-in-law with a stick during a family dispute in Beerkoor, Kamareddy district, resulting in injuries.
The victim's daughter, Sumalatha, filed a complaint at the local police station.
In a separate incident, a person sustained severe injuries, including a fractured arm, after a collision with a container truck on the 765D National Highway near Nesarlabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బీర్కూర్: అత్తపై అల్లుడు దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీర్కూర్‌కు చెందిన సతీష్ అనే వ్యక్తి అతడి భార్య సుమలతను తరుచూ వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సుమలత తల్లి పోశవ్వ శనివారం కుమార్తెను తీసుకెళ్లేందుకు బీర్కూర్‌కు వచ్చారు. కుటుంబ తగదా విషయాలపై అల్లుడిని నిలదీయగా మాటా మాటా పెరిగి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సతీష్ అత్త తలపై కర్రతో దాడి చేసి గాయపరిచాడు. ఆమెను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. తన తల్లిపై తన భర్త సతీష్ దాడిచేశాడని బీర్కూర్ ఠాణాలో సుమలత ఫిర్యాదు చేసింది.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు నస్రుల్లాబాద్: నెమ్లి గ్రామంలోని 765డి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి నస్రుల్లాబాద్ నుంచి బాన్సువాడ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో నెమ్లి వద్ద బాన్సువాడకు వెళ్తున్న కంటెయినర్ చివరి భాగం ద్విచక్ర వాహనం తాకడంతో వాహనదారుడు జాతీయ రహదారిపై పడటంతో కుడి చెయ్యి విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)