Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్‌లోని మంచిరేవుల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం డీజీపీ సి. వి. ఆనంద్‌కు అందజేశారు. కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ ఎస్.
సదానంద రెడ్డి, డాక్టర్ ఐ.ఎస్.ఆర్. రావు ఈ చెక్కును డీజీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక చొరవ చూపారని, పోలీసు అధికారులు ఈ ఆర్థిక సాయం వల్ల మెరుగైన విద్యా సదుపాయాలు కలుగుతాయని తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ : మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్ ( Aurobindo Pharma Foundation ) రూ.కోటి డీజీపీ సి. వి. ఆనంద్ ( DGP CV Anand ) కు చెక్కును బుధవారం అందజేశారు. అరోబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అరోబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ ఎస్. సదానంద రెడ్డి, అరోబిందో ఫార్మా లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ.ఎస్.ఆర్. రావు ఈ చెక్కును డీజీపీకి అందజేశారు.
ఈ విరాళం అందించడంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక చొరవ చూపారు. ఫౌండేషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, విరాళం అందేలా కృషి చేశారు. పాఠశాలలో మెరుగైన విద్యా సదుపాయాల కల్పన, మౌలిక వసతుల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించేందుకు ఈ ఆర్థిక సాయం దోహదపడనుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్య క్రమంలో మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, ఏడీజీ (శాంతిభద్రతలు) అకున్ సబర్వాల్ తోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)