Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ayodhya: అయోధ్య రామమందిర వేళల్లో మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి
By Eenadu1 min read at Eenadu
In brief
The Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust decided to make slight changes to the darshan timings of the Ayodhya Ram temple starting November 1.
The temple will now open at 4 AM instead of 3:45 AM, and the closing time will be 10 PM instead of 10:30 PM.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెప్క్: అయోధ్య (Ayodhya) రామాలయ దర్శన వేళల్లో స్వల్ప మార్పు చేస్తూ.. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. సీజన్ మార్పు నేపథ్యంలో ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి, రాత్రి 10 గంటలకు మూసివేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆలయాన్ని తెల్లవారుజామున 3:45 గంటలకు తెరిచి.. రాత్రి 10:30 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు. కొత్త మార్పులు నవంబర్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. వీటిలో భాగంగా ఉదయం 4.30 నుంచి 4.40 వరకు మంగళ హారతి నిర్వహించనున్నారు. ఆ తర్వాత అభిషేకం, ఇతర కార్యక్రమాల కోసం ఉదయం 6:30 వరకు ద్వారాలు మూసి ఉంటాయి.
ఉదయం 6:30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ‘బాలభోగ్’ కోసం ఆలయాన్ని ఉదయం 8 నుంచి 8:10 వరకు తిరిగి మూసివేస్తారు. అనంతరం 11:30 వరకు దర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ‘రాజ్‌భోగ్’ నైవేద్య సమర్పణ ఉంటుంది. అనంతరం 1:30 వరకు విశ్రాంతి సమయం ఉంటుంది. మధ్యాహ్నం 1:35 గంటల నుంచి దర్శన వేళలు ప్రారంభమవుతాయి. అలాగే, సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి ఇస్తారు. ఈ సమయంలో ఆలయ ద్వారాలు 15 నిమిషాల పాటు మూసివేసి తిరిగి భక్తుల దర్శనార్థం తెరుస్తారు. ఇదీ చదవండి: పండగకు స్థానిక ఉత్పత్తులనే కొనండి
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)