Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బామ్మ సాహసం... అనాథ బిడ్డ పెళ్లి కోసం
By Eenadu1 min read at Eenadu
In brief
A grandmother named Shantabai Pawar in Pune, Maharashtra, performs martial arts stunts on the street to raise money for an upcoming orphan girl's wedding.
She has dedicated her life to sheltering over 20 children, funding their education, and has previously married off several of them.
Despite facing financial difficulties and past debts, she remains committed to her responsibilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వణుకుతున్న చేతులతో మహారాష్ట్రలోని పుణె వీధుల్లో కర్రసాముతో సాహస ప్రదర్శనలు చేస్తున్న ఆ బామ్మ పేరు శాంతాబాయి పవార్. పుణె హడప్సర్ ప్రాంతంలో నివసిస్తున్న ఈమె తన జీవితాన్ని అనాథ పిల్లల సంరక్షణకు అంకితం చేశారు. 20 మందికిపైగా చిన్నారులను చేరదీసి ఆశ్రయం కల్పించడమే కాకుండా..చదువు, భోజనం వంటివి సమకూర్చే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. వారి పోషణ, చదువులకు అవసరమైన డబ్బును రోడ్డుపై డోంబారీ ఆటలు, కర్రసాము వంటి విన్యాసాలు చేస్తూ ఆర్జిస్తున్నారు. ఆశ్రయం పొందిన వారిలో కొందరు డిగ్రీ పూర్తిచేశారు. మరికొందరు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలకు వివాహాలు జరిపించారు.
కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. తన దగ్గర పెరుగుతున్న అనాథ యువతుల్లో ఒకరికి ఈ నెల 20న వివాహం జరిపించాల్సి ఉంది. వివాహానికి అవసరమైన డబ్బులు సమకూర్చేందుకు శాంతాబాయి మళ్లీ రోడ్డెక్కారు. రోజూ ఉదయం, సాయంత్రం రోడ్డు పక్కన కర్రసాముతో విన్యాసాలు చేస్తూ ప్రజల నుంచి సాయం పొందుతున్నారు. ‘గతంలో పిల్లల చదువులు, అవసరాల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. వాటికి వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. పెళ్లి కోసం నిధులు సమకూర్చుకోవడం ఇప్పుడు మరింత కష్టంగా మారింది. అయినా వెనక్కి తగ్గను..బతికి ఉన్నంత కాలం బాధ్యతల నుంచి తప్పుకోను’ అని శాంతాబాయి చెబుతున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)