Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బాపట్లలో తుపాను ప్రభావం.. యంత్రాంగం అప్రమత్తం
By Eenadu1 min read at Eenadu
In brief
Acyclone named Arnab is expected to severely impact Bapatla district, prompting the district police to remain on high alert.
Strong winds and heavy rain caused a large tree to fall on the Vellaturu-Donepudi road, disrupting traffic until police and revenue staff cleared it.
The cyclone also caused power outages and halted bus services on the Amrutaluru-Govada road until it was cleared.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమృతలూరు: అర్నబ్ తుపాను ప్రభావం బాపట్ల జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. ఈ క్రమంలో బలమైన గాలులకు భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లటూరు - దోనేపూడి రహదారిపై తెల్లవారుజామున ఓ భారీ వృక్షం విరిగిపడింది. సమాచారం అందుకున్న వెంటనే భట్టిప్రోలు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్పందించి ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్, ట్రాక్టర్, వుడ్ కట్టర్ల సహాయంతో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయానికి గాలి, వాన తీవ్రస్థాయికి చేరింది. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అమృతలూరు- గోవాడ ఆర్ అండ్ బీ రహదారి మార్గంలో పెద్ద చెట్టు కూలి రోడ్డుపై అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టును తొలగించే వరకు బస్సులను అమృతలూరులో నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు యంత్రాల సహాయంతో చెట్టును నరికి తొలగించారు. కొంత సమయం తర్వాత వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)