Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- The Food Safety and Standards Authority of India (FSSAI) proposed an amendment to prohibit the addition of fructose and sucrose in baby food products for children under six months. The Ministry of Health and Family Welfare stated that the goal is to protect infant health, promote exclusive breastfeeding, and prevent early childhood obesity. The public is invited to submit objections or suggestions on the draft proposal within 60 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Baby Food : ఆరు నెలల్లోపు వయసున్న పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్ (Fructose), సుక్రోజ్ (Sucrose) లను కలుపొద్దని ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI)’ ప్రతిపాదించింది. ఈ మేరకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్స్ ఫర్ ఇన్ఫాంట్ న్యూట్రిషన్) రెగ్యులేషన్స్ యాక్ట్ 2020’ కి సవరణ ముసాయిదాను ప్రచురించింది. పసితనంలోనే అదనపు చక్కెరలు తీసుకోవడాన్ని తగ్గించడం ద్వారా శిశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పోషకాహార భద్రతను బలోపేతం చేయడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.
బిడ్డ ఎదుగుదలకు మొదటి ఆరు నెలలు ఎంతో కీలకమని, ఈ వయసు వారికి అవసరమైన పోషకాలు అందించేలా సంబంధిత ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్, సుక్రోజ్లను కలపకుండా చూసేలా ఈ ప్రతిపాదనలను రూపొందించారని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలనే ప్రభుత్వ సిఫార్సులను ప్రోత్సహించేందుకూ ఈ చర్యలు తోడ్పడతాయని పేర్కొన్నది. బాల్యంలోనే ఊబకాయం, సంబంధిత ఆరోగ్య సవాళ్లను అరికట్టడం కూడా ఈ ప్రతిపాదనల ఉద్దేశమని వెల్లడించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)