Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
By NT News telugu||8 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- A report by 'Namasthe Telangana' alleges that the Congress government is planning to revoke the autonomy of the Building and Other Construction Workers' Welfare Board to cover up corruption involving Rs. 150 crore. The article suggests this is a strategy to transfer the board's substantial funds to the new 'Indiramma Family Life Insurance' scheme and benefit political insiders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: మంత్రి సిఫార్సు లేఖలనే అర్హతా పత్రాలుగా భావించి, అనర్హులకు రూ.లక్షలు అప్పగించిన వైనం బయటికి వచ్చింది. మొత్తంగా ఒక సిండికేట్ వ్యవస్థ ఏర్పడి రూ.150 కోట్లు దిగమింగిన ఉదంతం వెలుగుచూసింది. మరి అకస్మాత్తుగా ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? ఎందుకంటే.. ఈ అవినీతిని ఎత్తిచూపి, బోర్డు స్వయంప్రతిపత్తిని సమాధి చేయడమే పాలకుల అసలు ఎజెండాగా తెలుస్తున్నది. కార్మికుల రక్తమాంసాలతో బోర్డు ఖజానాలో పోగైన రూ.వేల కోట్ల నిధులను కొల్లగొట్టి, రాబోయే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ముసుగులోకి లాగి, బంధుగణానికి దళారీ లాభాలు దోచిపెట్టే కార్పొరేట్-రాజకీయ వ్యాపార వ్యూహం తయారైనట్టు సమాచారం.
అయితే నేరుగా స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తే, జరిగిన అవినీతి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలోనే పడుతుంది. పోనీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేద్దామంటే 80 పేజీల నివేదిక అడ్డంకిగా మారింది. బోర్డుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపాలంటూ 2022లో నాటి సీఎం కేసీఆర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశించారు. అధికారులు రెండేండ్లు జల్లెడపట్టి తయారు చేసిన నివేదికలో కేవలం రూ.36 లక్షలు పక్కదారిపట్టినట్టు తేల్చారు. దీంతో ఈ నివేదిక ఆధారంగా తమ ప్లాన్ను అమలు చేయలేమని కాంగ్రెస్ పెద్దలకు తెలిసివచ్చింది.