Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బంగాళాఖాతంలో బలపడుతున్న ‘అల్పపీడనం’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
వాతావరణ శాఖ ప్రకారం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా మారి డిసెంబర్ 7 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఈ తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగుతాయని తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అర్నబ్, మురసు, అక్వాన్ తుపానులు ఇప్పటికే ఏపీని అతలాకుతలం చేశాయి. తెలంగాణలో కూడా వర్షాలకు కారణమయ్యాయి. ఈ తుపానుల బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.
సముద్రంలో అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, ఆతర్వాత వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. అనంతరం తుపానుగా బలపడి డిసెంబర్ 7నాటికి తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను ఏర్పడితే దానిని ‘కాని’ అని పిలువనున్నట్టు మాల్దీవులు పేరును సూచించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)