Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బంగారు భవితకోసం...
By Eenadu2 min read at Eenadu
In brief
ప్రధాని మోదీ మే నెలలో అత్యవసరమైతే తప్ప ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజల స్పందన వల్ల ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో బంగారం దిగుమతుల విలువ దాదాపు 40 శాతం తగ్గింది మరియు జులై-సెప్టెంబర్లో పసిడి డిమాండ్ 29 శాతం మేర దిగివచ్చింది.
ఆర్థికవేత్తలు మరియు విధానకర్తలు బంగారం దిగుమతుల వల్ల కరెంట్ అకౌంట్ లోటు మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
భారత విదేశ మారకద్రవ్య నిల్వలపై విపరీతమైన ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని మోదీ మొన్న మేలో ప్రజలకు పిలుపిచ్చారు. అప్పటికి పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల చమురు దిగుమతుల బిల్లు పెరిగిపోయింది. అదే సమయంలో బంగారం దిగుమతులకూ డాలర్లను పెద్దయెత్తున గుమ్మరించాల్సి వస్తోంది. దాంతో రూపాయి విలువ తెగ్గోసుకుపోయి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే పరిస్థితులు తలెత్తాయి. అందుకే మోదీ ఆనాడు అలాంటి విజ్ఞప్తి చేశారు. ఆయన సూచనను ప్రజానీకం సానుకూలంగా స్వీకరించడంతోపాటు అనంతర పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో బంగారం దిగుమతుల విలువ దాదాపు…
భారతీయులకు బంగారం కేవలం పెట్టుబడే కాదు. సామాజిక హోదాకు, కుటుంబ భద్రతకు అదొక ప్రతీక. అందుకే వీలైనప్పుడల్లా ఎంతోకొంత కొని దాచుకుంటుంటారు. అలా భారతీయ గృహాల్లో 31వేల టన్నుల వరకు పసిడి పోగుపడినట్లు అంచనా. దానిమొత్తం విలువ సుమారు రూ.315 లక్షల కోట్లు. గడిచిన ఆరేళ్లలో ఇండియా నాలుగున్నర వేల టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి తెప్పించుకుంది. అందుకోసం పాతిక లక్షల కోట్ల రూపాయల మేర ధారపోసింది. భారీగా జరుగుతున్న ఈ దిగుమతులతో దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టుతప్పుతోందని ఐఎంఎఫ్, నీతి ఆయోగ్ గతంలోనే హెచ్చరించాయి. ఇంతాచేసి బంగారం చాలావరకు లాకర్లూ బీరువాల్లోనే మగ్గిపోతుండటంతో పరిశ్రమల స్థాపనకూ, అధునాతన సాంకేతికతల…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)