Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బర్డ్ ఫ్లూ నివారణకు స్వదేశీ టీకా!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కేంద్ర ప్రభుత్వం బర్డ్ ఫ్లూను నియంత్రించేందుకు స్వదేశీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నదని ఈ వ్యాసం నివేదిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఐసీఏఆర్ దీనిని అభివృద్ధి చేయగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నవంబర్ 20న దీనిని జాతికి అంకితం చేయనున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ అధ్యక్షులు ఉదయ్‌సింగ్ బయాస్, మోహన్‌రెడ్డి ఈ వ్యాక్సిన్ రాక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇది రైతులకు నష్టం జరగకుండా అరికడుతుందని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ‘బర్డ్ ఫ్లూ’ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త దేశీయ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ వైరస్ బారి నుంచి పౌల్ట్రీ రంగాన్ని రక్షించడానికి ఈనెల 20న కేంద్రప్రభుత్వం దీనిని జాతికి అంకితం చేయనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి టీకా ఇది. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఐసీఏఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇన్ యాక్టివేటెడ్ హెచ్5ఎన్1 (క్లాడ్ 2.3.2.1ఏ) హైలీపాథజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ను ఐసీఏఆర్ అభివృద్ధి చేసింది. ఈ టీకాను…
బర్డ్ ఫ్లూ నివారణకు కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం పట్ల పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్, తెలంగాణ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లకు సోకినప్పుడు వ్యాధి తీవ్రత పెరిగి దాదాపు 100 శాతం వరకు మరణాలు సంభవించేవని, వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అరికట్టడానికి కోళ్లను సామూహిక సమాధి చేయాల్సి వచ్చేదన్నారు. దీనివల్ల పౌల్ట్రీ రైతులకు తీరని నష్టం వాటిల్లేదన్నారు. ఒకవేళ బర్డ్ ఫ్లూ అదుపు తప్పి విసృ్తతంగా వ్యాపిస్తే.. మొత్తం కోళ్లలో 20 శాతానికి పైగా నాశనం అయ్యేవన్నారు. దీని ప్రభావం స్థూల జాతీయోత్పత్తి వృద్ధిని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)