Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు..డైరెక్ట్ దవాఖానకు తీసుకెళ్లిన డ్రైవర్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- A pregnant woman traveling in a Karnataka RTC bus experienced labor pains near Tandur. The driver quickly diverted the bus to the local maternity hospital, where hospital staff successfully assisted in the delivery. Both mother and child are reported to be safe, and the driver and conductor were praised by the hospital staff, locals, and the woman's family.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
తాండూరు, వెలుగు: కర్ణాటకకు చెందిన మహిళకు ఆర్టీసీ బస్సులో రాగా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి డైరెక్ట్ హాస్పిటల్‌కే తీసుకువెళ్లాడు. దీంతో సదరు మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. కర్ణాటకలోని చించోలి తాలూకా జెట్టూరు గ్రామానికి చెందిన పుష్పలత సోమవారం తాండూరుకు కర్ణాటక డిపో బస్సులో బయలుదేరింది. తాండూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.
వెంటనే స్పందించిన బస్సు డ్రైవర్ బస్సును ఏకంగా తాండూరు మాతా శిశు సంరక్షణ కేంద్రానికి పోనిచ్చాడు. విషయం తెలుసుకున్న దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజమాలిక్ వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సు వద్దకే స్ట్రెచ్చర్ తీసుకువెళ్లారు. గర్భిణిని హుటాహుటిన లోపలకు తీసుకువెళ్లి నార్మల్ డెలివరీ చేశారు. పుష్పలతకు పాప పుట్టిందని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు. అత్యవసర సమయంలోస్పందించి గర్భిణిని దవాఖానకు చేర్చిన బస్సు డ్రైవర్, కండక్టర్‌ను దవాఖాన సిబ్బంది, స్థానికులు, పుష్పలత కుటుంబసభ్యులు అభినందించారు.