Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that on November 1, a large number of leaders and workers from the Congress and BJP parties joined the BRS.
According to the report, 100 Congress members from Jayashankar Bhupalpally district joined under former MLA Gandra Venkata Ramana Reddy, and several others from Hanumakonda and Nalgonda districts also defected to the BRS.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్1: బీఆర్ఎస్ పార్టీలోకి జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. ఆదివారం కూడా ఆయా జిల్లాల్లో భారీగా చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఒంటిమామిడిపల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం నక్కలపెంట తండాకు చెందిన ఉప సర్పంచ్ అంగోతు మునియా, వార్డు సభ్యులు కేతావత్ హరియాతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వీరికి అంగడిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)