Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీమా.. దరఖాస్తులతోనే సరి!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సిద్దిపేట వేదికగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
కానీ, ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, నిధులు, అర్హతలపై స్పష్టత లేదని, కేవలం నమూనా దరఖాస్తు ఫారం మాత్రమే విడుదల చేశారని నివేదిక పేర్కొంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకంతో పోలిస్తే, ఇందులో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే బీమా వర్తిస్తుందని, ఇంకా ఏ ఇన్సూరెన్స్ కంపెనీతోనూ ఒప్పందం జరగలేదని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి దరఖాస్తుల పండుగ వచ్చింది! గతంలో ఆరు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇండ్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాసి దరఖాస్తు చేసుకున్న ప్రజలు.. ఇప్పుడు ‘ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం’ కోసం మరోసారి దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సిద్దిపేట వేదికగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
కానీ, ఈ రెండు పథకాలను ‘కాంగ్రెస్ మార్క్’ పాలన అలవాటులో భాగంగా వాయిదా వేశారు. ఇందిరమ్మ పథకాన్ని కేవలం దరఖాస్తులకే పరిమితం చేయగా, చీరల పంపిణీని వాయిదా వేశారు. దీంతో ప్రారంభానికి ముందే ఇందిరమ్మ బీమా పథకంపై . గురువారం ఉదయం ప్రారంభించబోయో పథకానికి బుధవారం రాత్రి వరకూ చాలా అంశాల్లో స్పష్టత కరువైంది. ముహూర్తం సమీపిస్తున్నా, పథకానికి సంబంధించిన విధి విధానాల్లేవు. నిధుల ఊసు లేదు. దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు? ఎక్కడ తీసుకుంటారు? ఎప్పటివరకు తీసుకుంటారు? ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? ఏ పత్రాలు జత చేయాలి? ఈ పథకానికి ఎవరు అర్హులు? ఇలా ఏ ఒక్క అంశంపైనా స్పష్టత లేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)