Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Benjamin Netanyahu alleged that foreign interference, specifically from Qatar, occurred during Israel's general elections.
He claimed Arab voters received money, which the Likud party suspects is related to recent election results.
Police dismissed these rigging allegations, stating there is no evidence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జెరుసలాం: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగినట్లు ప్రధాని బెంజిమన్ నెతన్యహూ (Benjamin Netanyahu)ఆరోపించారు. ఖతార్ నుంచి అరబ్ ఓటర్లకు డబ్బులు అందినట్లు లికుడ్ పార్టీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ షిన్ బెట్ ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. షిన్బెట్కు అందిన సమాచారం ఆధారంగా విదేశీ జోక్యం కోణంలో దర్యాప్తు జరగనున్నది. తాజాగా జరిగిన ఎన్నికల్లో నెతన్యహూకు చెందిన లికుడ్ పార్టీకి 53 సీట్లు దక్కాయి. ఇక ప్రతిపక్ష యాషర్ పార్టీకి 48 సీట్లు దక్కాయి. ఇంకా అరబ్ స్థానాలకు చెందిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
ప్రస్తుతం ఎన్నికల్లో నెతన్యహూ పార్టీకి మెజారిటీ దక్కలేదు. తాజా సమాచారం ప్రకారం ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ కోసం మరో 8 సీట్లు కావాల్సి ఉంది. అయితే అరబ్ ఓట్ల ఆధారంగా నెతన్యహూ భవితవ్యం తేలనున్నది. అరబ్ ఓట్ల అంశంలో రిగ్గింగ్ జరిగినట్లు ఆయన ఆరోపణలు చేశారు. అరబిక్ ఓటర్లను ఆకర్షించేందుకు ఖతార్ వాళ్లకు డబ్బులు పంపినట్లు లికుడ్ పార్టీ ఆరోపించింది. అరబ్ పార్టీలు ఎన్నికలను దోచినట్లు వస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు.దీనికి ఆధారాలు లేవన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)