Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
భావితరాలకు కుమ్రంభీమ్, సాయన్న ఆదర్శం : స్పీకర్ గడ్డం ప్రసాద్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Assembly Speaker Gaddam Prasad and Chairman Gutha Sukhender Reddy addressed a gathering in Hyderabad to commemorate the birth anniversaries of tribal heroes Komaram Bheem and Pando G Saibanna.
They described these figures as role models for future generations who fought against oppression and for the rights of marginalized communities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: హక్కుల కోసం పోరాడిన కుమ్రంభీమ్, పండుగ సాయన్న భావితరాలకు ఆదర్శమని, మహనీయుల ఆశయాలను కొనసాగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం అసెంబ్లీలో పండుగ సాయన్న 174వ జయంతి, ఆదివాసీ పోరాటయోధుడు కొమురంభీం 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి, మండలి సెక్రటరీ నరసింహాచారి పాల్గొని, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ, తెలంగాణ నేల పోరాటాలకు, త్యాగాలకు, ఆత్మగౌరవానికి నిలయమన్నారు. సామాజిక అసమానతలు, దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. "జల్, జంగల్, జమీన్" అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రంభీమ్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. పండుగ సాయన్న అణగారిన వర్గాల పక్షాన నిలిచిన గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. కుమ్రంభీమ్, పండుగ సాయన్న వంటి మహనీయుల పోరాటాల వెనుక సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం వంటి గొప్ప ఆశయాలు ఉన్నాయని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)