Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bhuvan survey | రామగుండంలోని ఇండ్లు, భవనాలకు జియో ట్యాగింగ్‌కు భువన్ సర్వే
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Additional Collector and Ramagundam Municipal Commissioner J.
Aruna ordered the completion of a Bhuvan geo-tagging survey for houses and buildings in Godavarikhani by Saturday.
She directed ward officials and staff to accelerate tax collection, impose penalties on unauthorized constructions, and issue notices for tax arrears during a review meeting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Bhuvan survey | కోల్ సిటీ, అక్టోబర్ 23 : గోదావరిఖని నగరంలోని ఇళ్లు, భవనాల వివరాలను సేకరించి జియో ట్యాగింగ్ సర్వే ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు పన్ను వసూళ్లలో మరింత వేగం పెంచాలని అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ ఆదేశించారు. వార్డు అధికారులు, సహాయకులు, రెవెన్యూ విభాగం సిబ్బందితో పన్ను వసూళ్ల పురోగతిపై శుక్రవారం సాయంత్రం నగర పాలక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఆదాయం మెరుగుపరచడానికి లక్ష్యం ప్రకారం ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, లైసెన్సు ఫీజులు వసూలు చేయాలన్నారు.
అనుమతి లేని కట్టడానికి వంద శాతం పెనాల్టీ విధించాలన్నారు. నివాస గృహ అనుమతి పొంది తదుపరి వాణిజ్య భవనాలుగా మార్చిన వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. దీర్ఘకాలంగా పన్ను బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్లు, భవనాల వివరాలను సేకరించి జియో ట్యాగింగ్ చేయడానికి నిర్వహిస్తున్న భువన్ సర్వే శనివారం నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సెక్రెటరీ మహేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఆర్ ఐ ఖాజా, జూనియర్ అసిస్టెంట్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)