Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Billboard Hacking | హ్యాకింగ్ కలకలం.. డిజిటల్ హోర్డింగ్‌లపై బ్లూ ఫిల్మ్స్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that hackers took control of digital advertising billboards in multiple countries to broadcast obscene videos, causing public alarm.
The attacks occurred in Egypt, Malaysia, Brazil, Iraq, and China on the 29th of last month.
A Telegram group named 'Leakrs' claimed responsibility, stating they exploited security flaws in the content-delivery software.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Billboard Hacking | కైరో, కౌలాలంపూర్: పలు దేశాల్లో డిజిటల్ ప్రకటనల హోర్డింగ్‌లను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకొని వాటిపై సాధారణ ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం కలకలం రేపింది. గత నెల 29న ఈజిప్ట్, మలేషియా, బ్రెజిల్, ఇరాక్, చైనాలో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఈ పరిణామం డిజిటల్ ప్రకటనల వ్యవస్థల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నది. ఈజిప్ట్‌లోని గిజా నగరంలో రద్దీ రహదారిపై ఏర్పాటుచేసిన భారీ ఎలక్ట్రానిక్ హోర్డింగ్‌పై అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయి. వాటిని చూసిన వాహనదారులు కొందరు తమ వాహనాలను ఆపి వాటిని వీడియోలు తీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈజిప్ట్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఆ హోర్డింగ్‌ను నిర్వహిస్తున్న సంస్థకు ప్రకటనల కంటెంట్‌ను అందించే ఓ అంతర్జాతీయ సంస్థ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. దాని ప్రభావంతో పలు దేశాల్లోని డిజిటల్ తెరలపై అనధికార కంటెంట్ ప్రసారమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. మలేషియాలోని జోహోర్ రాష్ట్రం క్లువాంగ్ పాంతంలో పలు ప్రభుత్వ ఎల్ఈడీ తెరలపై అసభ్యకర కంటెంట్ ప్రసారమైనట్లు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ ధ్రువీకరించింది. బ్రెజిల్‌లోని కాంపో మయోర్ ప్రాంతంలోనూ ఓ డిజిటల్ ప్రకటనల తెరపైన అశ్లీల దృశ్యాలు కనిపించాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)