Namasthe Telangana
బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ రిపీట్?
Entertainment — not analysed for political framing
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో కల్యాణ్‌రామ్ సినిమా నిర్మిస్తున్నట్టు శనివారం అధికారికంగా బయటకొచ్చిన వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ని నింపింది. ఆ జోష్ని రెట్టింపు చేస్తూ ఆ వెంటనే మరో వార్త కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. ఆ వివరాల్లోకెళ్తే.. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘నేలకొండ భగవంత్‌కేసరి’ చిత్రం ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రివార్డులతోపాటు అవార్డులను కూడా ఆ సినిమా సొంతం చేసుకున్నది.
త్వరలో మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానున్నదని, అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నారని, 2028 సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నదనేది ఈ వార్త సారాంశం. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరి ఎన్టీఆర్ సినిమాను అనిల్ ఎప్పుడు పూర్తి చేస్తారు?.. బాలకృష్ణ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారు?.. అసలు ఈ సినిమాలకు సంబంధించిన కథలు ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నాయా? బాలయ్య సినిమాకు సంబంధించిన వార్తలో నిజమెంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)