Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Black Sky crisis: ‘బ్లాక్ స్కై’కు సిద్ధమవుతోన్న బ్రిటన్.. అసలేంటిది..?
By Eenadu2 min read at Eenadu
In brief
ఐరోపా దేశాలను కొన్ని వారాలుగా భిన్న సమస్యలు వెంటాడుతున్నాయని, సూపర్ మార్కెట్లలో ఫ్రిజ్‌లు హ్యాకింగ్‌కు గురికావడం, మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల్లో అంతరాయం, బాంబు బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయని ఈ వ్యాసం తెలియజేస్తుంది.
ఊహించని పరిణామాల వల్ల సేవల్లో అంతరాయం కలగడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలోనే బ్లాక్ స్కై సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ సూచిస్తూ బ్రిటన్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని రాసింది.
ఈ ముప్పుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని యూకే రక్షణ మంత్రి వెస్ స్ట్రీటింగ్ విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఐరోపా దేశాలను కొన్ని వారాలుగా భిన్న సమస్యలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. సూపర్ మార్కెట్లలో ఫ్రిజ్‌లు హ్యాకింగ్‌కు గురికావడం, మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల్లో అంతరాయం, వరుస బాంబు బెదిరింపు (Bomb threats) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఊహించని పరిణామాల వల్ల సేవల్లో అంతరాయం కలగడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ స్కై సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ సూచిస్తూ బ్రిటన్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
వివిధ కారణాలతో కీలక మౌలిక సదుపాయాల్లో అంతరాయాల కారణంగా అత్యవసర సేవలు నిలిచిపోవడాన్నే ‘బ్లాక్ స్కై’గా (Black Sky Event) వ్యవహరిస్తారు. సైబర్ దాడుల వల్ల ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోవడం.. ప్రకృతి విపత్తులు లేదా వరదలు, కార్చిచ్చులు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విద్యుత్ సేవలు నిలిచిపోయే పరిస్థితులు; తద్వారా నీటి సరఫరా వ్యవస్థకు అంతరాయం, దుకాణాల్లో ఫ్రిజ్‌లు పనిచేయకపోవడం వంటి పరిస్థితులు ఎదురవ్వడం.. ఆసుపత్రులు, ప్రజా రవాణా సేవల్లో అంతరాయం, ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు పెంచుకునే వీలు లేకపోవడంలాంటి పరిస్థితిని బ్లాక్ స్కైగా పేర్కొంటారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)