Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Boat Rescue: సముద్రంలో 5,400 కి.మీ. కొట్టుకుపోయి.. 3 నెలలకు సజీవంగా బయటపడి
By Eenadu1 min read at Eenadu
In brief
Nine people set out on a 20-foot boat in Micronesia on July 30 but were caught in a storm and drifted for 5,400 km.
Local residents near Kiritimati, Kiribati, found the boat, and five survivors, including two children, were rescued.
US Coast Guard officials confirmed the incident and stated the survivors are receiving treatment for severe dehydration and malnutrition.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: పసిఫిక్ మహాసముద్రంలో అద్భుతం జరిగింది! పడవలో ప్రయాణిస్తుండగా తుపానులో చిక్కుకుని ఏకంగా 5,400 కి.మీ. మేర కొట్టుకుపోయిన ప్రయాణికులు.. మూడు నెలల తర్వాత సజీవంగా బయటపడ్డారు. జులై 30న తొమ్మిది మంది కలిసి 20 అడుగుల పడవలో మైక్రోనేసియా దేశంలోని మురిలో ద్వీపం నుంచి రువో ద్వీపానికి బయల్దేరారు. అంతలోనే తుపానులో చిక్కుకున్నారు. రువో ద్వీపానికి వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో అధికారులు గాలింపు చేపట్టారు. 10 రోజుల్లో 85,700 చదరపు కిలోమీటర్ల మేర జల్లెడపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్వామ్లోని యూఎస్ కోస్ట్ గార్డ్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల పసిఫిక్ ద్వీప దేశమైన కిరిబాటిలోని ఫానింగ్ ఐలాండ్ సమీపంలో ఆ పడవను స్థానికులు గుర్తించి కాపాడారు. ఆ సమయానికి పడవలో ఇద్దరు చిన్నారులు సహా అయిదుగురు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలతో బయటపడటం అనేది నమ్మశక్యంకాని విషయమని యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. తీవ్ర డీహైడ్రేషన్, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని.. వారు కోలుకుంటున్నారని కిరిబాటి వైద్యాధికారులు తెలిపారు. పడవ ఆచూకీ లభ్యం కావడంతో అటు మైక్రోనేసియాలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)