Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
A bomb threat email was sent to the Mumbai Mayor's office, prompting a high alert in the city.
The threats also targeted Bollywood actor Amitabh Bachchan's residence, singer Diljit Dosanjh's concert, and a school.
Security forces conducted extensive searches but found no suspicious items.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబై: ముంబై మేయర్ ఆఫీస్‌కు బెదిరింపు మెయిల్() వచ్చింది. దీంతో ఆ నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మెయిల్ ద్వారా బెదిరిస్తూ మేయర్ రీతూ తవాడేకు లేఖ పంపారు. మేయర్ ఆఫీసు వద్ద బాంబు బ్లాస్ట్ జరగనున్నట్లు హెచ్చరించారు. దీంతో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, గాయకుడు దిల్జీత్ దోసంజి కచేరిలను కూడా టార్గెట్ చేయనున్నట్లు తమ హెచ్చరికల్లో పేర్కొన్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉన్న మేయర్ ఆఫీసులో తీవ్రంగా గాలింపు చేపట్టారు. అయితే అనుమానిత వస్తువులను ఏదీ గుర్తించలేదు.
డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. అక్టోబర్ 31వ తేదీన స్కూల్‌పై గ్రేనేడ్ దాడి జరుగుతుందని హెచ్చరించారు. జూహూలో ఉన్న బచ్చన్‌కు చెందిన జల్సా ఇంటిపై అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య దాడి చేస్తామని బెదిరించారు. మహాలక్ష్మీ రేస్‌కోర్సు ఏరియాలో నవంబర్ 27వ తేదీన జరగనున్న దిల్జీత్ దోసాంజి కన్సర్ట్పై దాడి చేస్తామని ఓ సందేశంలో ఖలిస్తానీలు హెచ్చరించారు. బెదిరింపు మెసేజ్ నేపథ్యంలో భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. మెసేజ్‌లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు పంపారన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మేయర్ ఆఫీసు వద్ద సెక్యూర్టీ క్రమంగా పెంచారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)