Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బూడిద లారీల్లో కలెక్టర్ దోపిడీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఉచితంగా ఇచ్చే బూడిదను తరలించే లారీల నుంచి కలెక్టర్ రూ.500 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు.
గత మూడేండ్లలో 1.24 లక్షల ట్రిప్పుల ద్వారా రూ.6 కోట్లు వసూలు చేశారని, దీనికి ఎలాంటి రసీదులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
కలెక్టర్ వసూలు చేసిన రూ.6 కోట్లను లారీ యజమానులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ, లేదంటే డీపీటీవో, సీబీఐ తదితర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
పెద్దపల్లి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రామగుండం ఎన్టీపీసీ ఉచితంగా ఇచ్చే బూడిదను తరలించే ఒక్కో లారీ నుంచి ఎలాంటి జీవో, సర్యులర్ లేకుండానే కలెక్టర్ రూ.500 చొప్పున వసూలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించా రు. బుధవారం ఆయన పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత మూడేండ్లలో అధికారికంగానే 1.24 లక్ష ల ట్రిప్పుల ద్వారా రూ.6 కోట్ల వరకు వ సూలు చేశారని, దీనికి ఎలాంటి రసీదులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఎవరి ఆదేశాల మేరకు కలెక్టర్ ఈ డబ్బులు వ సూలు చేసి ఎవరి ఖజానాలోకి మళ్లించా రో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. ఇదే తరహాలో మట్టి తరలింపునకు క్యూబిక్ మీటర్‌కు రూ.40 నుంచి 50 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, రూ.3,500 వసూలు చేస్తూ లారీ యజమానుల మండిపడ్డారు. కలెక్టర్ వసూలు చేసిన రూ.6 కోట్లను తక్షణమే లారీ నంబర్ల ఆధారంగా ఆయా యజమానులకు తిరిగి చెల్లించాలని, లేదంటే డీపీటీవో, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీరామ లారీ యాష్ టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె అశోక్, ముత్యం అనిల్‌గౌడ్, రాముగౌడ్ పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)