Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
BRS | బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల హత్యాయత్నం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కొల్లాపూర్లోని తీగలపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు కంట్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని గ్రామస్తులు గమనించి 108 వాహనంలో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి తరలించారు.
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కొల్లాపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ అరచాకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కన్నా రెడ్డి భాస్కర్ రెడ్డి పై గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కంట్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భాస్కర్ రెడ్డిని రోడ్డుపై వస్తున్న కొందరు గమనించి గ్రామస్తుకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని 108 వాహనంలో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి తరలించారు.
తీగలపల్లి గ్రామానికి చెందిన కురువ పెద్ద బిచ్చయ్య, తెలుగు బాల చంద్రయ్య, తెలుగు వీరభద్రయ్య, తెలుగు ఆంజనేయులు అనే వ్యక్తులు భాస్కర్ రెడ్డి గురువారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా దారి కాచి కంట్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. రక్తం మడుగులో పడి ఉన్న భాస్కర్ రెడ్డి చనిపోయాడని భావించిన దుండగులు చెట్ల పొదల్లో భాస్కర్ రెడ్డిని పడేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)