Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Two buses carrying pilgrims collided in Punjab's Tarn Taran district, killing four people and injuring 30.
The accident occurred when one bus swerved to avoid a woman on a scooter, striking another pilgrim bus.
Punjab Chief Minister Bhagwant Mann expressed his grief over the incident and directed officials to ensure the best medical care for the injured.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
చండీగఢ్: తీర్థ యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. 30 మంది యాత్రికులు గాయపడ్డారు. వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. (buses carrying pilgrims collide) పంజాబ్లోని తరణ్ తరణ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉచిత తీర్థయాత్రల ద్వారా వృద్ధులను పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు ఆ రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా లాహిరిదాస్, బఘియారి గ్రామాలకు చెందిన యాత్రికులతో ఒక బస్సు తీర్థయాత్ర ముగించుకుని ఫరీద్కోట్ జిల్లాకు తిరిగి వెళ్తున్నది.
కాగా, శనివారం తరణ్ తరణ్ జిల్లాలోని నౌషెహ్రా పన్నూవాన్ సమీపంలో ఒక బాలుడితో కలిసి స్కూటీపై వెళ్తున్న మహిళ ఒక క్రాసింగ్ వద్ద హైవేను దాటేందుకు ప్రయత్నించింది. ఆమె స్కూటీని ఢీకొట్టకుండా ఉండేందుకు ఎదురుగా వస్తున్న ఫరీద్కోట్ వెళ్లే బస్సు డ్రైవర్ వాహనాన్ని వేగంగా పక్కకు తిప్పాడు. దీంతో మరో లేన్లోకి ఆ బస్సు దూసుకెళ్లింది. లాంబీ నియోజకవర్గంలోని భీడీవాల్ గ్రామం నుంచి అమృత్సర్ వైపు వెళ్తున్న ఎదురుగా వస్తున్న మరో తీర్థయాత్ర బస్సును అది ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి రెండు బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)