Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CEO jobs back: ఈ టెక్ కంపెనీలతో వారి బంధం విడదీయలేనిది..
By Eenadu2 min read at Eenadu
In brief
ఎన్విడియా నుంచి వైదొలిగిన జెన్సన్ కేవలం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆ స్థానాన్ని తిరిగి పొందారని ఈ వ్యాసం నివేదించింది.
ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ను యాజమాన్యం తొలగించినా, ఉద్యోగుల వ్యతిరేకతతో వారం వ్యవధిలోనే తిరిగి బాధ్యతలు చేపట్టారని పేర్కొంది.
అలాగే స్టీవ్ జాబ్స్, జాక్ డోర్సే, ముల్లెన్వెగ్ వంటి ఇతర సీఈవోలు కూడా రాజీనామా చేసి మళ్లీ పదవులు చేపట్టారని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: వివాహేతర సంబంధాల కారణంగా ప్రపంచ అగ్రగామి ఏఐ (కృత్రిమమేధ) చిప్సెట్ల తయారీ సంస్థ ఎన్విడియా నుంచి వైదొలిగిన జెన్సన్.. కేవలం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆ స్థానాన్ని తిరిగి పొందారు. సంస్థను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన వ్యక్తి.. పక్కకు తప్పుకొన్నంత మాత్రాన సంస్థతో ఆయనకు సంబంధాలు తెగిపోయినట్లు కాదని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. ప్రధానంగా టెక్నాలజీ రంగంలో చాలా మంది సీఈవోలు అనూహ్యంగా రాజీనామా చేసి.. మళ్లీ బాధ్యతలు చేపట్టారు. వారెవరో ఓసారి పరిశీలిస్తే..
ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ను యాజమాన్యం 2023 నవంబర్లో ఆ పదవి నుంచి తొలగించింది. అయితే, కేవలం వారం వ్యవధిలోనే అతడు మళ్లీ సీఈవో బాధ్యతలు చేపట్టారు. నమ్మకాన్ని కోల్పోయారన్న కారణంతో ఓపెన్ ఏఐ యాజమాన్య బోర్డు ఆల్ట్మన్ను తొలగించింది. దీంతో ఉద్యోగులంతా ఎదురుతిరిగారు. ఆయన్ను తిరిగి నియమించాలని కోరుతూ దాదాపు 700 మంది ఉద్యోగులు ఓపెన్ ఏఐకి లేఖలు రాశారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ కూడా తమ సంస్థకు రావాలని ఆహ్వానించింది. కొన్ని రోజుల పాటు ఈ అనిశ్చితి కొనసాగిన తర్వాత.. సీఈవోగా ఆల్ట్మన్ తిరిగి వస్తారని నవంబర్ 21న సంస్థ ప్రకటించింది. 29 నుంచి ఆయన అధికారిక బాధ్యతలు చేపట్టారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)