Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
చదువుకు తగిన జాబ్ ఎప్పుడు?
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
ఈ వ్యాసంలో, హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ పాల్గొని వారికి ఆరోగ్య, ప్రమాద బీమాల పథకాలను ప్రకటించారు.
గత ప్రభుత్వం తెచ్చిన టీఎస్-ఐపాస్, టాస్క్ వంటి విధానాల వల్ల హైదరాబాద్ ఐటీ రంగంలో వృద్ధి సాధించిందని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లను నింపి ఉపాధి కల్పించాలని రచయిత కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మా ఇంటికి వారంలో చాలాసార్లు క్విక్ కామర్స్ యాప్‌ల నుంచి సరుకులు వస్తుంటాయి. తలుపు దగ్గర పార్సిల్ అందించే యువకులతో రెండు మాటలు మాట్లాడటం నాకు అలవాటు. ‘ఏం చదివావు బాబూ? ఏ ఊరు?‘ అని అడుగుతుంటాను. వచ్చే జవాబులు నన్ను ఆలోచనలో పడేస్తాయి. అందులో కొందరు ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ చదివినవాళ్లు ఉంటారు. వాళ్లంతా రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల నుంచి వచ్చినవాళ్లు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరకక, ఇంటికి ఈ పనిలో చేరినవాళ్లు. ఎండలో, వానలో, ట్రాఫిక్‌లో వేగంగా సరుకులు అందించే ఆ యువకులు కష్టపడి, గౌరవంగా తమ కుటుంబాలను పోషిస్తున్నారు. పార్సిల్ అందుకుని తలుపు మూసిన ప్రతిసారీ ఒక ప్రశ్న నన్ను…
హైదరాబాద్‌లో ఈ నెల 14న కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ గిగ్ వర్కర్ల ర్యాలీలో పాల్గొన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఓ పథకాన్ని ప్రకటించారు. దాదాపు 4.5 లక్షల మందికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తామని చెప్పారు. కానీ బీమా ప్రమాదం జరిగాక ఆదుకుంటుంది, ఉద్యోగం జీవితాన్ని నిలబెడుతుంది. చదువుకున్న యువకుడికి కావాల్సింది రెండోది. భారత్ జోడో యాత్రలో రాహుల్ తెలంగాణ గ్రామాల మీదుగా పాదయాత్ర చేస్తూ యువతతో మాట్లాడారు. ఈ సారి ఒక గిగ్ వర్కర్ బైక్ వెనుక కూర్చుని, ముచ్చటించారు. ఆ బైక్ నడిపిన వారిని ‘ఏం చదివావు?‘ అని అడిగి ఉంటే, బహుశా మా తలుపు దగ్గర నాకు వచ్చిన జవాబే వచ్చి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)