Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
చంద్రశేఖరన్ నియామకంపై కోర్టుకెక్కిన టాటా ట్రస్ట్స్
By Eenadu2 min read at Eenadu
In brief
టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకాన్ని సవాలు చేస్తూ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్డీ టాటా ట్రస్ట్ గురువారం బాంబే హైకోర్టును ఆశ్రయించాయి.
జరిగిన నష్టానికి గానూ ఎస్‌డీటీటీ రూ.50 కోట్లు, ఆర్డీటీటీ రూ.15 కోట్లు పరిహారం కోరడం గమనార్హం.
టాటా సన్స్ బోర్డు ఆమోదించిన తీర్మానం చెల్లదని, అనుకూల ఓట్లు లభించలేదని టాటా ట్రస్ట్స్ తన పిటిషన్లో పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Tata Sons | ముంబయి: టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం విషయంలో టాటా గ్రూప్‌లో తలెత్తిన వివాదం మరింత ముదురుతోంది. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల కాలానికి గానూ నియమించడాన్ని సవాలు చేస్తూ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT), ఆర్డీ టాటా ట్రస్ట్ (RDTT) గురువారం బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. జరిగిన నష్టానికి గానూ ఎస్‌డీటీటీ రూ.50 కోట్లు, ఆర్డీటీటీ రూ.15 కోట్లు 18 శాతం వార్షిక వడ్డీతో పరిహారం కోరడం గమనార్హం.
టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను పునర్నియమిస్తూ టాటా సన్స్ బోర్డు సెప్టెంబర్ 17న తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (AoA)లోని 121వ నిబంధన ప్రకారం అవసరమైన అనుకూల ఓట్లు లభించనందున ఆ తీర్మానం చెల్లదని టాటా ట్రస్ట్స్ తన పిటిషన్లో పేర్కొంది. సింగిల్ బెంచ్ దీనిపై శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. నవంబర్ 30న జరిగే బోర్డు మీటింగ్‌లో టాటా సన్స్ ఛైర్మన్ హోదాలో చంద్రశేఖరన్ తన ఓటు హక్కు వినియోగించుకోకుండా నిలువరించే ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)