Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chanadrababu: రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్: సీఎం చంద్రబాబు
By Eenadu1 min read at Eenadu
In brief
ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యావసరాల ధరల నియంత్రణపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
డిసెంబరు మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్‌ను సబ్సిడీ ధరలకు అందించాలని ఆదేశించారు.
బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా పెంచాలని, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 34 days across 5 events →
అమరావతి: నిత్యావసరాల ధరల భారం సామాన్యులపై పడనివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chanadrababu) స్పష్టం చేశారు. నిత్యావసరాల ధరల నియంత్రణపై సచివాలయంలో సీఎం.. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబరు మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు రూ.100కు, లీటరు పామాయిల్ రూ.125కి అందించాలని ఆదేశించారు. ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను 286 నుంచి 500కు విస్తరించాలని సూచించారు.
బియ్యం, ఉల్లి, పామాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయని అధికారులు వివరించారు. నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిఘా పెంచాలని, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని, నీటి లభ్యత ఆధారంగానే పంటల ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. కూరగాయల ధరలు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ధరల భారం తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తేల్చిచెప్పారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)