Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని సత్యసాయి చాటిచెప్పారు: సీఎం చంద్రబాబు
By Eenadu2 min read at Eenadu
In brief
రాష్ట్ర పండుగగా సత్యసాయి బాబా జయంతిని నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేశ్ సత్యసాయి బాబా అందించిన ఆధ్యాత్మిక సందేశాన్ని మరియు సమాజ సేవలను స్మరించుకున్నారు.
అమరావతి కేంద్రంగా ఈ కార్యక్రమ వివరాలు నివేదించబడ్డాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ప్రేమ, సేవ, మానవత్వమే ఆధ్యాత్మికతకు అసలైన అర్థమని ప్రపంచానికి చాటిన మహనీయుడు భగవాన్ సత్యసాయి బాబా అని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అన్నారు. సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశం, సమాజ సేవలను స్మరించుకున్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో సత్యసాయి అందించిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు కొనియాడారు. నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని ఆయన చాటిచెప్పారని గుర్తుచేశారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస బోధనలు ఎప్పటికీ ఆచరణీయమన్నారు. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు అనే సాయి సందేశాన్ని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారతీయ ఆధ్యాత్మికతను, సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు సత్యసాయి అని కొనియాడారు. విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలతో ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. సత్యసాయి సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మానవ సేవే పరమావధిగా జీవించిన సత్యసాయి ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)