Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ గొప్ప న్యాయవాదులను అందించింది: చంద్రబాబు
By Eenadu1 min read at Eenadu
In brief
సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం 222 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన న్యాయ ఉత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సత్వరం తీర్పులిచ్చే స్థాయికి న్యాయవ్యవస్థ ఎదిగిందని, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ గొప్ప న్యాయవాదులను అందించిందని అన్నారు.
వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతుందని, 2027లో గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహించనున్నామని చంద్రబాబు చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం 222 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం ఏర్పడి 222 ఏళ్లు.. బార్ అసోసియేషన్ స్థాపించి 131 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యాయ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజేతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు.
‘‘టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సత్వరం తీర్పులిచ్చే స్థాయికి న్యాయవ్యవస్థ ఎదిగింది. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ గొప్ప న్యాయవాదులను అందించింది. రాజమహేంద్రవరం నుంచి గొప్ప నాగరికత అభివృద్ధి చెందింది. ఆదికవి నన్నయ, కందుకూరి వీరేశలింగం పంతులు ఇక్కడే పుట్టి సమాజ సేవ చేశారు. సర్ ఆర్థర్ కాటన్ కట్టిన ధవళేశ్వరం బ్యారేజీతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. గోదావరి జిల్లాల వల్లే ఏపీకి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరొచ్చింది. వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతుంది. 2027లో గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహించనున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గోదావరి పుష్కరాలకు రావాలి. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)