Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా..అగార్కర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన హైదరాబాదీ
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Former Indian spinner Pragyan Ojha has been appointed as the Chairman of the BCCI's Senior Men's Selection Committee. Ramesh Powar has also been added to the committee as a member to replace Ajit Agarkar. The Cricket Advisory Committee unanimously recommended these appointments to the BCCI Secretary.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
బెంగళూరు: టీమిండియా మాజీ స్పిన్నర్, హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓజా.. మెన్స్ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యాడు. సీనియారిటీ ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వెల్లడించింది. ఇక మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్.. సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో అతని ప్లేస్‌లో పవార్‌ను తీసుకున్నారు.
అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ పవార్ నియామకాన్ని ఏకగ్రీవంగా సిఫారసు చేసిందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించాడు. 48 ఏళ్ల పవార్ ఇండియా తరఫున 2 టెస్ట్‌లు, 31 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత విమెన్స్ టీమ్, ముంబై, గుజరాత్ జట్లకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్లోనూ బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. శివసుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా మిగతా సెలెక్టర్లుగా ఉన్నారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)