Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చెన్నూరులో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సరోజ వివేక్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Saroja Vivek, the wife of State Labour and Mines Minister Vivek Venkataswamy and Managing Director of Visakha Industries, visited Kistampet and Lambadipally in Chennur mandal, Mancherial district, to participate in the Saddula Bathukamma celebrations. She performed the traditional Bathukamma dance with women and children, offered prayers at local temples, and was felicitated by the village priests. She was accompanied by several Congress party members and local leaders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ వివేక్ సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట, లంబడిపల్లి గ్రామాల్లో పర్యటించారు. దసరా వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులతో కలిసి సద్దుల బతుకమ్మ ఆడారు. వీ6 బతుకమ్మ పాటకు గ్రామస్తులతో కలిసి ఆడిపాడి సందడి చేశారు.
అనంతరం దుర్గామాత, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సరోజ వివేక్ మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని దేవుళ్లను కోరుకున్నట్లు తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.