Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఛత్తీస్‌గఢ్ సీఎంతో నేడు (నవంబర్ 17) రేవంత్, ఉత్తమ్ భేటీ ..సమ్మక్కసాగర్ బ్యారేజీకి ఎన్వోసీపై చర్చలు
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క–సారలమ్మ బ్యారేజీకి సంబంధించిన అంతర్రాష్ట్ర అడ్డంకులను తొలగించేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎంతో భేటీ కాబోతోంది.
ఈ నెల 10న ప్రాజెక్ట్ డీపీఆర్‌ను వెనక్కి పంపిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్తో చర్చించనున్నారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ నివేదిక ప్రకారం బ్యారేజీ నిర్మాణం వల్ల అదనపు ముంపు కేవలం 40 హెక్టార్లు మాత్రమేనని, దానికి పూర్తి పరిహారం మరియు పునరావాసం కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాగునీటి రంగానికి కీలకమైన సమ్మక్క–సారలమ్మ (సమ్మక్క సాగర్) బ్యారేజీకి ఉన్న అంతర్రాష్ట్ర అడ్డంకులను తొలగించుకునే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. చత్తీస్‌గఢ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ని సాధించేందుకు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్తో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న ప్రాజెక్ట్ డీపీఆర్‌ను వెనక్కి పంపిన నేపథ్యంలో.. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. సోమవారం సీడబ్ల్యూసీ చైర్మన్‌తోనూ భేటీ అయ్యారు. ఈ వరుస…
సమ్మక్క సాగర్ బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ మట్టం +83 మీటర్లు కాగా.. ఆ స్థాయిలో చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం తహసీల్ పరిధిలో కేవలం 181 ఎకరాలే ముంపునకు గురవుతాయని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అందులో 32 ఎకరాలు వ్యవసాయ భూములైతే.. 133 ఎకరాలు నదీ గర్భంలోనే ఉంటుందని, మరో 16 ఎకరాలు నాలా భూమి అని తెలిపింది. కాగా 2022 జూలైలో గోదావరికి 88 మీటర్ల మేర గరిష్ఠ వరద వచ్చినందున, భారీ వరదల సమయంలో బ్యాక్‌వాటర్ ప్రభావం ఎలా ఉంటుందో తేల్చాలంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణులతో ప్రత్యేక స్టడీ చేయించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)