Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చిక్కడ పల్లి వ్యాపారి కిడ్నాప్ కేసులో 10 మంది అరెస్ట్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Hyderabad police arrested 10 people, including a realtor, for the kidnapping of businessman K. Srinivasarao of Chikkadpally. The police recovered Rs. 1.07 crore, vehicles, and gold from the kidnappers at the Bonguluru toll plaza. The kidnapping was orchestrated due to a long-standing land dispute between the victim and the realtor.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
అంబర్పేట్, వెలుగు: హైదరాబాద్‌లో చిక్కడపల్లికి చెందిన వ్యాపారి కె.శ్రీనివాసరావు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. అంబర్‌పేటలోని సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రక్షితా కె.మూర్తి, టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య వివరాలు వెల్లడించారు.
తుర్కయంజాల్‌కు చెందిన రియల్టర్ దుమావత్ శ్రీకాంత్‌కు, బాధితుడు శ్రీనివాసరావుకు మధ్య మూడేళ్లుగా భూ లావాదేవీల వివాదాలున్నాయి. శ్రీనివాసరావు స్వయంగా భూ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఓర్వలేని శ్రీకాంత్, జైలులో పరిచయమైన శ్రీనివాస్ రెడ్డితో కలిసి కిడ్నాప్‌కు ప్లాన్ వేశాడు. ఇందుకోసం పాత నేరస్తులు అయిన భోజగుట్టకు చెందిన గుంజపాగు సురేశ్, చంపాపేటకు చెందిన బండారి సంసన్, అత్తపూర్ కు చెందిన గూడెం శ్రవణ్ కుమార్, కూకట్ పల్లి చెందిన హీరాసింగ్, ధన్సింగ్, బూరాని కుల్దీప్సింగ్, భీమి సింగ్, అత్తాపూర్ కు చెందిన సర్దార్ గబ్బార్, బిహార్ కు చెందిన వికాస్ లతో ముఠాను ఏర్పాటు చేశాడు.