Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Chinese restaurants use high-temperature cooking with large pans and powerful gas stoves, which causes oil to vaporize and ignite, creating the characteristic flames and smoky flavor known as 'wok hei' in stir-fry dishes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Chinese Food | మండుతున్న నూడుల్స్ నుంచి మంటలు చెలరేగుతున్నట్లుగా కనిపించే ఫ్రైడ్ రైస్ వరకు.. చైనీస్ రెస్టారెంట్ల వంటగదుల్లో ఆహారం వండేటప్పుడు ఒక్కసారిగా ఎగిసిపడే మంటలను మీరు గమనించే ఉంటారు. వంట చేసే సమయంలో కనిపించే ఈ మంటల వెనుక అధిక వేడి, నూనె, వంట చేసే విధానం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. చైనీస్ రెస్టారెంట్లలో వంట చేస్తున్నప్పుడు చెఫ్‌లు పెద్ద పెనంలో నూడుల్స్, కూరగాయలు లేదా అన్నాన్ని వేగంగా కలుపుతూ కనిపిస్తారు. అలా కలుపుతున్న సమయంలో ఒక్కసారిగా పెనం చుట్టూ మంటలు ఎగిసిపడతాయి. ఇది వంటలో భాగంగా కనిపించినప్పటికీ, కేవలం ప్రదర్శన కోసం చేసే పని కాదు. దీని వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం…
దీనికి ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రత, వేడెక్కిన నూనె, శక్తివంతమైన గ్యాస్ పొయ్యిల కలయిక. అనేక రెస్టారెంట్ల వంటగదుల్లో ఉపయోగించే పెద్ద పెనాలు సాధారణంగా మన ఇళ్లలోని పొయ్యిల కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడెక్కుతాయి. నూనె బాగా వేడెక్కినప్పుడు అందులో కొంత ఆవిరిగా మారడంతో పాటు చిన్న చిన్న నూనె బిందువులుగా విడిపోతుంది. చెఫ్ ఆహార పదార్థాలను పెనంలో పైకి ఎగరేసి కలిపినప్పుడు ఈ నూనె బిందువులు కూడా పైకి ఎగసిపడతాయి. అవి పొయ్యి మంటకు తగిలినప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి. అయితే ఈ మంటలు సాధారణంగా ఒకటి లేదా రెండు సెకన్ల పాటు మాత్రమే కనిపించి వెంటనే ఆగిపోతాయి. ఆ తర్వాత వంట యథావిధిగా కొనసాగుతుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)