Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
చోళుల కాలం నాటి నాణేలు, నిజాం కరెన్సీ ఎప్పుడైనా చూశారా ? హైదరాబాద్‌లో అరుదైన ఎగ్జిబిషన్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఈ నెల 20 నుంచి 22 వరకు ‘హైపెక్స్–2026’ అనే అరుదైన నాణేలు, పాత కరెన్సీ నోట్లు, స్టాంపుల ప్రదర్శన జరగనుంది.
హైదరాబాద్ ఫిలటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ అధ్యక్షుడు సాగి శ్రీనివాసరాజు మాట్లాడుతూ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల నుంచి సేకర్తలు తమ సేకరణలతో వస్తున్నారని చెప్పారు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన సేకర్త జీ గంగాధర్ సోషల్ మీడియాలో పాత నాణేలు కొంటామంటూ సైబర్ నేరగాళ్లు మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒకప్పుడు చేతులు మారిన అణాలు, పైసలు.. రాజుల పాలనకు, ఆనాటి ఆర్థిక వ్యవస్థకు ఆనవాళ్లుగా నిలిచిన అరుదైన నాణేలు.. ఇప్పుడు చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఒక్కో నాణెం ఒక్కో కాలాన్ని, ఒక్కో రాజ్యాన్ని కండ్ల ముందుంచుతుంది. అలాంటి నాణేలు, పాత కరెన్సీ నోట్లు, స్టాంపుల ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తెస్తోంది ‘హైపెక్స్–2026’. ఈ నెల 20 నుంచి 22 వరకు సిటీలోని రెడ్‌హిల్స్‌లో ఈ ప్రదర్శన జరగనుంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పాట్నా, లక్నో, జైపూర్, తిరువనంతపురం నుంచి సేకర్తలు తమ సేకరణలతో వస్తున్నారని హైదరాబాద్ ఫిలటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ అధ్యక్షుడు సాగి శ్రీనివాసరాజు చెప్పారు. 35…
రాజుల కాలం నుంచి నిజాం దాకా చోళుల కాలం నాటి రాగి నాణేలు, బాబర్, అక్బర్, షాజహాన్ కాలం నాటి వెండి నాణేలు అప్పటి పాలనకు, వాణిజ్యానికి అద్దం పడతాయి. నిజాం కాలం నాటి హైదరాబాద్ కరెన్సీ ‘ఉస్మానియా సిక్కా’ మన సిటీ చరిత్రకు సాక్ష్యం. బ్రిటిష్ కాలం నాటి నోట్లు, స్వాతంత్రం తర్వాత 1960ల నాటి వంద రూపాయల నోట్లు, నెమలి, లేడి, బోటు బొమ్మలతో వచ్చిన పాత నోట్లు కాలంతో పాటు కరెన్సీ ఎలా మారిందో చెబుతాయి. 1982 ఏషియన్ గేమ్స్, సైన్స్ కాంగ్రెస్, బాలగంగాధర తిలక్ పేరిట వచ్చిన స్మారక నాణేలు ఆయా ఘట్టాలను గుర్తుచేస్తాయి. ఇలాంటి అరుదైన, తక్కువగా ముద్రించిన నాణేలకు సేకర్తల్లో రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా విలువ ఉందని…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)