Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
CJP leaders Ashutosh Rana and Saurav Das stated that the party's movement will not stop even if they are arrested, as they appeared for questioning before the Delhi Crime Branch.
They were previously jailed for protesting at Jantar Mantar on October 13 and were recently granted bail by a court before being issued new summons.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
CJP leaders : తమను అరెస్టు చేసినా సీజేపీ చేపట్టిన ఉద్యమం ఆగబోదని ఆ పార్టీ అగ్రనేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లు అన్నారు. తమ నేతలు ఎవరిని అరెస్టు చేసినా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లు శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అక్టోబర్ 13న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన సందర్బంగా నిబంధనలు ఉల్లంఘించడం వంటి అంశాలపై పోలీసులు ఇద్దరికీ బుధవారం సమన్లు జారీ చేశారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో రాంకా, దాస్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాయకులు అరెస్టైతే ఉద్యమం ఎలా కొనసాగిస్తారు అంటూ మీడియా ప్రశ్నించగా.. తమను అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. తమ అరెస్టుల వల్ల తమ గురించి మరింతగా తెలుసుకునేందుకు అవకాశం దొరికందన్నారు. అలాగే, వ్యవస్థలు ఎలా పని చేస్తాయో కూడా అర్థమైందన్నారు. తాము నాయకులం కాదని, దేశ ప్రజలు తమకు అందించిన వ్యవస్థకు సంరక్షకులం మాత్రమే అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)