Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
Medak District Collector Pratima Singh and District SP D.V.
Srinivasarao participated in a Police Martyrs' Memorial Day event in Medak.
They honored fallen officers, praised their sacrifices for public safety, and emphasized the police's role in maintaining law and order and aiding in district development.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Collector Pratima Singh | మెదక్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరుల…
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతోపాటు జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారని, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)