Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Congress: ఆ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయొద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ లేఖ
By Eenadu1 min read at Eenadu
In brief
Gaddam Vamsi Krishna, the MP from Peddapalli, wrote a letter to Minister Sridhar Babu on Monday, urging him not to suspend Congress MLAs who skipped the INDIA alliance rally in Delhi.
The letter was released on social media and sparked discussions among political circles, especially given the existing differences between the MP and the district MLAs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పెద్దపల్లి, న్యూస్‌టుడే: దిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన సభకు హాజరు కాని పార్టీ ఎమ్మెల్యేలపై వేయొద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం మంత్రి శ్రీధర్‌బాబుకు లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం కలకలం రేపుతోంది. జిల్లా ఎమ్మెల్యేలతో ఎంపీకి విభేదాలుండడంతో ఈ లేఖ విడుదల చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. శ్రీధర్‌బాబుకు వంశీకృష్ణ లేఖ రాస్తూ ‘మీరు, విజయ రమణారావు, మక్కాన్‌సింగ్‌లు మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిసింది. వ్యక్తిగత విశ్వాసాలను, మతపరమైన కార్యక్రమాలను నేను పూర్తిగా గౌరవిస్తాను.
అయితే ఇటీవల విశాఖ ట్రస్టు కార్యక్రమానికి హాజరైనందుకే ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధితో సహా కాంగ్రెస్ కార్యకర్తలకు షోకాజ్ నోటీసు సైతం ఇవ్వకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం . సొంత పార్టీ ఎంపీతో కలిసి పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడమే భావిస్తే.. దిల్లీలో నిర్వహించిన సభకు హాజరు కాకపోవడాన్ని అంతకంటే తీవ్రమైన ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుంది. కానీ ఈ ఒక్కసారి మక్కాన్‌సింగ్, విజయ రమణారావులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదని, వారిని సస్పెన్షన్ నుంచి మినహాయించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)