Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. సీఎస్‌కు ఫిర్యాదు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మంచిర్యాల నియోజకవర్గంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడిందని ఈ వార్త పేర్కొంది.
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ప్రోటోకాల్ వివాదం ముదరడంతో, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు ఫిర్యాదు చేశారని తెలిపింది.
మంచిర్యాలలో వెంకటస్వామి విగ్రహావిష్కరణ వ్యవహారం తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, జగన్మోహన్రావు రెండు వర్గాలుగా విడిపోవడంతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలిశారని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Congress | కాంగ్రెస్ పార్టీలో మరో వర్గపోరుకు తెరలేసింది. నిన్న మొన్న మాజీ మంత్రి కొండా సురేఖ ఉదంతం మరవక ముందే తాజాగా మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య వివాదం ముదురుతున్నది. నిన్న(బుధవారం) మంథనిలో ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని మంత్రి శ్రీధర్ బాబుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు ఫిర్యాదు చేశారు. శిలాఫలకంలో సంబంధిత శాఖల మంత్రుల పేర్లు లేవని ఆరోపించారు. కాగా, మంచిర్యాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది.
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు (పీఎస్ఆర్), అసమ్మతి నేత జగన్మోహన్రావు (జగన్) రెండు వర్గాలుగా చీలిపోయారు. మంచిర్యాలలో వెంకటస్వామి విగ్రహావిష్కరణ వ్యవహారం మరువకముందే.. మంచిర్యాలకు చెందిన 8 మంది కార్పొరేటర్లు, లక్షెట్టిపేటకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, దండేపల్లికి చెందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఉపసర్పంచ్లు, మాజీ సర్పంచ్ శుక్రవారం జగన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలువడంతో వర్గవిభేదాలను బట్టబయలు చేశాయి. ఇవి మరవకముందే నేడు మంత్రి, ఎంపీ మధ్య వివాదాలు పొడసూపడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)