Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Congress | పెన్ పహాడ్ కాంగ్రెస్లో అసమ్మతి సెగ.. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా?’.. సీనియర్ నేత బహిరంగ లేఖాస్త్రం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
సూర్యాపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ బెల్లంకొండ శ్రీరాములు ఒక బహిరంగ లేఖ రాశారు.
తనను పార్టీలో పక్కనపెట్టారని, బీసీ నాయకుడిననే చిన్నచూపు చూశారని, ఆర్థిక స్థోమత లేదనే నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
స్థానిక గ్రూపు రాజకీయాల కారణంగా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, పార్టీలో అంతర్గత విభేదాల వల్ల పెన్ పహాడ్ మండలంలో కాంగ్రెస్ ఓట్ల మెజారిటీ తగ్గిపోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Congress | పెన్ పహాడ్, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసినా గుర్తింపు దక్కడం లేదంటూ సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ‘బీసీ నాయకుడిననే ? ఆర్థిక స్థోమత లేదనే ?’ అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బెల్లంకొండ శ్రీరాములు రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తమ గ్రామానికి చెందిన నాతాల వెంకట్రామిరెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని శ్రీరాములు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నారు. గతంలో తాను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తన అభిమాన నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడానికి కారణమేంటని ప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)