Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Two foreign nationals, identified as a German and a Slovakian, died from an electric shock in the swimming pool of the Conrad Star Hotel in Bengaluru on a Friday evening.
Two others were injured during the rescue attempt.
The hotel has announced that the pool will be closed for maintenance from October 31 to November 30.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగుళూరు: బెంగుళూరులో విషాద ఘటన జరిగింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న ఇద్దరు విదేశీయులు ఎలక్ట్రిక్ షాక్ తగిలి మృతిచెందారు. నగరంలోని కాన్రాడ్ ఫైవ్ స్టార్ హోటల్(Conrad Star Hotel) పూల్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నది. బాధితులను జర్మనీ, స్లోవేకియా దేశస్థులిగా గుర్తించారు. ఆ ఇద్దరు ఆ హోటల్లోనే బస చేస్తున్నారు. ఆ ఇద్దర్నీ రక్షించే క్రమంలో మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిలో అమెరికా దేశస్థుడు ఒకరు కాగా, పూల్ అటెండెంట్ ఉన్నారు.
జర్మనీ దేశస్థుడిని 57 ఏళ్ల అలెగ్జాండర్ మాక్సిమిల్లన్ థీసీస్గా గుర్తించారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో అతను సిబ్బందిగా చేస్తున్నాడు. ప్రాణాలు కోల్పోయిన స్లోవేకియా దేశస్థుడిని 45 ఏళ్ల జురాజ్ హోర్వట్గా తేల్చారు. ఐబీఎం టెక్ కంపెనీలో అతను ప్రాజెక్టు మేనేజర్‌గా చేస్తున్నాడు. హోటల్ మూడవ ఫ్లోర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని మాథ్యూ డిసాంటిస్, రాహుల్ తివారీగా గుర్తించారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)