Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
పెరూలోని లిమా సమీపంలో కారులో వెళుతున్న ఒక భారతీయుడు మరియు ఒక స్థానిక మహిళపై దుండగులు కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి మరియు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పెరూ పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Crime news : పెరూ (Peru) లో జరిగింది. దుండగులు భారతీయుడిపై కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. పెరూ రాజధాని లిమా (Lima) కు సమీపంలో పట్టపగలే ఈ ఘటన జరిగింది. దుండగుల కాల్పుల్లో భారత పౌరుడితోపాటు ఒక స్థానిక మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. 29 ఏళ్ల భారత జాతీయుడు విజయ్ పగ్రానీ ఇజా (Vijay Pagrani Iza) , 35 ఏళ్ల పెరూ మహిళ మారి నాటలీ మిరాండా ఎస్పినోజా (Mari Nataly Miranda Espinoza).. నగల ప్యాకేజీలతో జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కారులో వెళుతున్నారు.
ఈ క్రమంలో కోస్టా వెర్డే హైవేపై శాంటా రోసా అవెన్యూ వద్ద ముసుగులు ధరించిన కొందరు వారి వాహనాన్ని అడ్డగించారు. కారు విండోస్ లక్ష్యంగా కాల్పులు జరిపి, ఆ కారులోని నగలు ఉన్న బ్రీఫ్కేసులతో పరారయ్యారు. ఈ దాడిలో విజయ్, ఎస్పినోజా ఇద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని వెంటనే శాన్ జుడాస్ టాడియో క్లినిక్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)