Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Cyclone Akvan | ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. తీవ్ర తుపానుగా బలపడిన వాయుగుండం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు, విశాఖపట్నం మధ్య ఏపీ, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించగా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంల అధికారులను ఆదేశించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Cyclone Akvan | బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారిన ఆక్వాన్.. బుధవారం ఉదయం 5.30 గంటల సమయానికి అక్వాన్ తుపాను దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు దిశగా 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 610 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 730 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ…
అక్వాన్ తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు, విశాఖపట్నం మధ్య ఏపీ, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ సమయంలో ఇది తీవ్ర తుపానుగానే కొనసాగుతుందని తెలిపింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించింది. అయితే ఇది మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)