Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
దాడులు ఆపితే రూ.9,500 కోట్లు ఇస్తాం.. హూతీలకు సౌదీ ఆఫర్ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
Saudi Arabia offered approximately $1 billion (Rs.
9,500 crore) to the Houthi rebels to cease attacks on its infrastructure and oil fields, according to reports from Israeli media.
The proposed payment is reportedly to be delivered through Iran, though Saudi authorities have not yet officially confirmed these details.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.సౌదీలోని మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరుగుతున్నాయి.దీంతో ఆ దేశానికి ఆర్థికంగా, ప్రాణాల పరంగా నష్టం వాటిల్లుతోంది.మరోవైపు, హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేయడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై దాడులు మరింత పెరుగుతుండటంతో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.హూతీలతో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇరాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సౌదీ రక్షణ మంత్రితమ దేశంపై దాడులను పూర్తిగా నిలిపివేస్తే హూతీలకు ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,500 కోట్లు) చెల్లించేందుకు సౌదీ అంగీకరించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి.ఈ మొత్తాన్ని ఇరాన్ ద్వారా హూతీలకు అందించే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి.ఈ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపేందుకే ఇటీవల సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లినట్లు సమాచారం.ఆయన ప్రయాణించిన సైనిక రవాణా విమానంలోనే హూతీలకు చెల్లించాల్సిన డబ్బును తీసుకొచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.అయితే, ఈ వివరాలను సౌదీ అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
This is Visalaandhra’s reporting. Read it where it was published.
Read the full story at Visalaandhra (opens in a new tab)
