Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Dada Dhamaka: ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. సింగర్‌గా బాలయ్య.. నర్గీస్ ఫక్రీతో అదిరిపోయే డ్యాన్స్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The first single 'Dada Dhamaka' from the upcoming film 'Dada', starring Nandamuri Balakrishna and directed by Gopichand Malineni, has been released.
The song features Balakrishna's energetic dancing alongside Bollywood actress Nargis Fakhri, and marks his return as a singer after a nine-year break.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ యాక్షన్.. పవర్ఫుల్ డైలాగ్స్.. అదిరిపోయే ఎనర్జీ. ఇక ఆయన డ్యాన్స్ ఫ్లోర్‌లోకి దిగితే అభిమానులకు పూనకాలే! ఇప్పుడు అలాంటి మాస్ జోష్‌కు బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కలర్‌ఫుల్ గ్రేస్ తోడైంది. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ‘దాదా’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘దాదా ధమాకా’ విడుదలైంది. తమన్ తనదైన స్టైల్లో కంపోజ్ చేసిన ఈ పాట మాస్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా బాలయ్య స్వయంగా గొంతు కలపడం, నర్గీస్ ఫక్రీతో కలిసి ఆయన చేసిన డ్యాన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
‘దాదా ధమాకా’ పాటకు తమన్ అదిరిపోయే మాస్ బీట్స్ అందించారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ పాటకు మరింత జోష్ తీసుకొచ్చాయి. ఈ పాటలో బాలకృష్ణ, శ్రీపూర్ణిమ తమ గాత్రంతో అలరించారు. మరో విశేషం ఏంటంటే.. బాలయ్య కేవలం తెరపైనే కాదు, తన గొంతుతోనూ ఈ పాటలో సందడి చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మరోసారి ఆయన సింగర్‌గా మారి కొన్ని లైన్స్ ఆలపించడం అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్గా మారింది. గతంలో ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామా ఏక్ పెగ్ లా’ పాటతో అలరించిన బాలయ్య.. ఇప్పుడు ‘దాదా ధమాకా’తో మరోసారి తన గాత్రాన్ని వినిపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)