Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Deeksha Divas | దీక్షా దివస్‌కు అధిక సంఖ్యలో తరలి రావాలి.. కొండన్నపల్లిలో బొట్టు పెట్టి గ్రామస్తులను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నవంబర్ 29న అలుగునూర్ లో జరిగే దీక్షా దివస్ సభకు ప్రజలను ఆహ్వానించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లిలో బీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి మహిళలు, గ్రామస్తులకు బొట్టు పెట్టి ఆహ్వానించారు.
రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బీజం పడిందని గుర్తు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Deeksha Divas | గంగాధర, నవంబర్ 24 : ఈనెల 29న అలుగునూర్ లో నిర్వహిస్తున్న దీక్షా దివస్ సభకు వేలాదిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. దీక్షా దివస్ సభను పురస్కరించుకొని గంగాధర మండలం కొండన్నపల్లిలో బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి మహిళలు, గ్రామస్తులకు బొట్టుపెట్టి సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బీజం పడిందని గుర్తు చేశారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తు చేశారు. గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను , హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శించారు. కాంగ్రెస్ పోవాలని, కేసీఆరే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అదే నినాదమైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)