Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డీలిమిటేషన్ బిల్లుపై ఇండీ కూటమి కీలక భేటీ.. ఎన్సీపీ (ఎస్పీ) డుమ్మా
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై చర్చించనున్నట్లు తెలుపుతూ, ప్రతిపక్ష ఇండీ కూటమి శనివారం న్యూఢిల్లీలో సమావేశమైందని ఈ కథనం నివేదించింది.
డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకాలేదని, ఇది ఇండీ కూటమికి ఎదురుదెబ్బగా మారిందని వివరించింది.
బిల్లుకు మద్దతు ఇస్తున్న డీఎంకే డిమాండ్లను, విమర్శలను, అలాగే ప్రభుత్వ వాదనలను వివిధ నాయకుల మాటల ద్వారా ఈ కథనం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపై చర్చించేందుకు శనివారం (నవంబర్ 28) ప్రతిపక్ష ఇండీ కూటమి భేటీ అయ్యింది. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా ఈ భేటీకి హాజరయ్యారు.
సమాజ్వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, టీఎంసీ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రాజ్యాంగ సవరణ బిల్లును ఎలా ఎదుర్కోవాలనే అంశంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇండీ కూటమిలోని డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ పార్టీలు కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ఆ పార్టీల ప్రతినిధులు హాజరు కాలేదు. ఈ పరిణామం ఇండీ కూటమికి భారీ ఎదురు దెబ్బగా మారింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)