Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
డీలిమిటేషన్‌కు రంగం సిద్ధం
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును మరోసారి తీసుకురాబోతున్న ఊహాగానాల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని నిర్ణయించింది.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్ బిల్లులకు అవకాశం ఉండదని వారు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్ బిల్లును కేంద్రం మరోసారి తీసుకురాబోతున్నదన్న ఊహాగానాల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను వచ్చే వారం తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30న లోక్‌సభ, వచ్చే నెల 2న రాజ్యసభను సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉభయ సభల సమావేశాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు సమావేశాలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, ప్రైవేట్ మెంబర్ బిల్లులకు అవకాశం ఉండదని వారిద్దరూ తెలిపారు.2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంటరీ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యచరణను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పార్లమెంటును సమావేశపరిచి డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును ఆమోదింపజేయడానికి ఎన్డీయే కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)