Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Cyberabad police arrested six people in Hyderabad for allegedly blackmailing a suspended MIM MLC, Mirza Rahmat Baig, using morphed photos and deepfake videos, demanding Rs 5 crore.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఎమ్మెల్సీకి సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసిన నిందితులు ఇప్పటికే రూ.5 లక్షలు వసూలు చేయగా, మరో రూ.5 లక్షల కోసం ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద డబ్బులు తీసుకుంటుండగా నార్సింగి పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటంతో పాటు త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో 14 మంది నిందితులు ఈ కుట్రకు తెరలేపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయనకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేశారు. వాటి ఆధారంగా అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించారు. ఈ వీడియోలు బయటకు వస్తే ఆయన రాజకీయ, సామాజిక ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని భయపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా బాధితుడిపై ఒత్తిడి తెచ్చిన నిందితులు మొదట రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. అనంతరం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)